ప్రియురాలి హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదు !

Telugu Lo Computer
0

  

కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని కొల్లం ప్రాంతంలో ప్రశాంత్ నంబియార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి అప్పటికే ఓ యువతితో పెళ్లైంది. చాలా కాలం పాటు తన భార్యతో సాఫీగా సంసారాన్ని సాగిస్తూ వచ్చాడు. కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఇక 2019లో జరిగిన వీరి కుమారుడి నామకరణ కార్యక్రమానికి ప్రశాంత్ భార్య స్నేహితురాలైన సుచిత్ర (42) అనే వివాహిత కూడా హాజరైంది. దీంతో అప్పటి నుంచి సుచిత్ర, ప్రశాంత్ మధ్య బంధం బలపడింది. ఇద్దరూ సీక్రెట్ గా తరుచు ఛాటింగ్, మీటింగ్ లు అంటూ గడిపేవారు. మరో విషయ ఏంటంటే? సుచిత్రకు అప్పటికే రెండు సార్లు వివాహం జరిగి విడాకులు కూడా తీసుకుంది. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. దీంతో అప్పటి నుంచి తన బిడ్డను చూసుకుంటూ ప్రశాంత్ తో శారీరకంగా దగ్గరైనట్లు పోలీసులు తెలిపారు. అలా వీరి ప్రయాణంలో ప్రశాంత్ తన ప్రియురాలు సుచిత్ర వద్ద రూ. 2.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. సుచిత్ర ప్రియుడు ప్రశాంత్ తో ఉండాలని కోరింది. దీనికి ప్రశాంత్ నిరాకరించినట్లుగా సమాచారం. అనంతరం పాలక్కడ్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో సుచిత్రను ఉంచాడు. ప్రశాంత్ కూడా అప్పుడప్పుడు వెళ్లి వస్తుండేవాడు. ఇకపోతే సుచిత్ర ఇచ్చిన రూ.2.5 లక్షల నగదు తిరిగి ఇవ్వాలని ప్రశాంత్ ను పట్టుబట్టింది. ఆ సమయంలో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ప్రశాంత్ తన భార్యతో పాటు తన తల్లిదండ్రులను కోజికోడ్ కు పంపాడు. వారు అక్కడికి వెళ్లిన తర్వాత ప్రశాంత్ సుచిత్రను రాత్రి పూట తన ఇంటికి రమ్మనేవాడు. కానీ, అతడు ఓ కండిషన్ పెట్టాడు. ఇంటికి వచ్చే క్రమంలోనే ఖచ్చితంగా నల్లటి దుస్తువులు ధరించి రావాలని సూచించాడు. ప్రియురాలు తన ఇంటికి రావడాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు నల్లటి దుస్తువులు ధరించి రావాలని వీరిద్దరి వాట్సాప్ మేసేజ్ లో తేలింది. అయితే సుచిత్ర ఇచ్చిన రూ.2.5 లక్షలు ఇవ్వాలంటూ ప్రశాంత్ ను గట్టిగా అడిగింది. దీంతో విసిగిపోయిన ప్రశాంత్.. ఎలాగైన ప్రియురాలు సుచిత్రను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ప్రశాంత్ ప్రియురాలిని ఎలా హత్య చేయాలనే దానిపై గూగుల్ లో సెర్చ్ చేయడంతో పాటు కొన్ని క్రైమ్ సినిమాలు కూడా చూసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బ్యూటీషియన్ శిక్షణ కోసం కొల్లాం వెళ్తున్నానని సుచిత్ర ఇంట్లో చెప్పే విధంగా ప్రశాంత్ ఆమె కుటుంబ సభ్యులకు అబద్దం చెప్పించాడు. ఆ తర్వాత మార్చి 17న ప్రియురాలు సుచిత్రను తన ఇంటికి రప్పించుకున్నాడు. ఇద్దరు కలిసి మార్చి 20వ వరకూ ఒకే ఇంట్లో ఉన్నారు. అదే రోజు సాయంత్రం ప్రశాంత్ పథకం ప్రకారమే సుచిత్రను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి త్రిసూర్ వెళ్లిపోయాడు. కొన్ని గంటల తర్వాత ఆమె బతికే ఉందని అందరికీ తెలియడానికి ఆమె ఫోన్ మళ్లీ స్విచ్ఛ్ ఆన్ చేశాడు. ఇక ప్రశాంత్ పాలక్కాడ్ తిరిగొచ్చాడు. వచ్చే క్రమంలో మృతురాలి ఫోన్ ను ఎవరికి దొరకకుండా ఓ చోట విసిరేశాడు. అనంతరం ప్రశాంత్ ప్రియురాలి మృతదేహాన్ని భాగాలు కట్ చేసి తన ఇంటి పెరట్లో గుంత తొవ్వి అందులో పూడ్చి పెట్టాడు. ఇక సుచిత్ర కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు మార్చి 22న పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా ఎట్టకేలకు నిందితుడు ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దర్యాప్తు సంస్థలు అతడిని విచారించే క్రమంలో ప్రశాంత్ ఆ సంస్థలను తప్పుదోవ పట్టించాడు. అతడు గూగుల్ లో ఏం సెర్చ్ చేశాడు? ఎక్కడికి వెళ్లాడు? ప్రశాంత్, సుచిత్ర మధ్య జరిగిన వాట్సాప్ పూర్తి ఛాటింగ్ ను కూడా పోలీసులు బయటకు తీసి పరిశీలించారు. ఇక మొత్తానికి ప్రశాంత్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. మూడేళ్ల కిందట జరిగిన ఈ హత్య కేసు కేరళలో సంచలనం సృష్టించింది. అయితే కేసులో భాగంగా కేరళలోని కొల్లం కోర్టు నిందితుడు ప్రశాంత్ కు జీవిత ఖైదుగా శిక్ష విధిస్తూ తాజాగా తీర్పును వెలువరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)