కేంద్రానికి కొప్పర్తిని ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం !

Telugu Lo Computer
0


15వ ఆర్దిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపాదలు కోరింది. ప్రభుత్వం కడప జిల్లా కొప్పర్తిని ప్రతిపాదించింది. రాయలసీమ కడప జిల్లాలోని కొప్పర్తిని ప్రభుత్వం ప్రతిపాదించటం వెనుక వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. దీని పైన ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. ఎంపిక చేసిన ప్రాంతాల అభివృద్ధికి ప్రతీ ఏటా 250 కోట్ల రూపాయలను  కేంద్రం ఇవ్వనుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన సమయంలోనే కొత్త నగరం అభివృద్ధికి కొప్పర్తిని ప్రతిపాదించినట్లు స్పష్టం అవుతోంది. దేశంలో పట్టణ ప్రాంతాలు రద్దీగా మారిన సమయంలో ప్రణాళిక లేకుండా విస్తరిస్తున్నాయని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఈ సమయంలో మౌలిక వసతుల అభివృద్ధి కష్టమవుతోందని పేర్కొంది. మౌలిక సదుపాయాలు లేకపోవటం కష్టంగా మారుతోంది. ఈ సమయంలో పాత నగరాలను కొత్త రూపునిస్తూ కొత్త నగరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆర్దిక సంఘం స్పష్టం చేసింది. కొత్తగా నిర్మించే గ్రీన్ ఫీల్డ్ నగరాల్లో రహదారుల నిర్మాణం, తాగు నీరు, మురుగు నీటి పారుదల వంటి వ్యవస్థలకు కావాల్సిన విధంగా అన్నీ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే, ఇప్పుడు మూడు రాజదానులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసిన తరువాత ఇప్పడుు కొప్పర్తిని కొత్త నగరంగా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అమరావతిని కాదని ఇతర ప్రాంతాలను నగరంగా అభివృద్ధికి ప్రతిపాదించటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే కడప జిల్లా కొప్పర్తి లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్, 3167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌ నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండింటిలో మౌలిక వసతులు కల్పన (రోడ్లు, విద్యుత్‌ సరఫరా), ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణం కోసం అక్షరాల రూ.1580 కోట్లతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుచేశారు. ఇక, ఇప్పుడు కేంద్రం కొత్త నగరాల నిర్మాణంలో భాగంగా కొప్పర్తిని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)