శంషాబాద్ నుంచి ఫ్రాంక్ ఫర్ట్ కు తొలి డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్ !

Telugu Lo Computer
0


లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ వచ్చే ఏడాది జనవరి 16న శంషాబాద్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్టుకు తొలి డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్ ప్రారంభించనుంది. దీనిలో 26 బిజినెస్ క్లాస్, 21 ప్రీమియం ఎకానమీ, 247 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. ప్రారంభ విమానం ఫ్రాంక్‌ ఫర్ట్ నుంచి ఉదయం 10కి బయలుదేరి, రాత్రి 11 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి ఒంటిగంటకు బయలుదేరి ఉదయం 6:10కి ఫ్రాంక్‌ఫర్ట్ లో ల్యాండ్ అవుతుంది. ఫ్రాంక్‌ఫర్ట్, -శంషాబాద్ విమానాశ్రయాల మధ్య మంగళ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తుంది. సోమ, బుధ, శనివారాల్లో హైదరాబాద్‌ నుంచి విమానం బయలుదేరుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)