నీరా అమ్మకాలకు ఆదరణ !

Telugu Lo Computer
0


'నీరా'పై హైదరాబాద్ నగర వాసులు మనసుపడ్డారు.  పార్సిల్స్‌ తెప్పించుకుని మరీ నీరా తాగుతున్నారు. ప్రకృతి అందించిన ఈ పానీయం వారిని అమితంగా ఆకట్టుకుంటోందనడానికి హుస్సేన్‌ సాగర్‌ సమీపంలో వెలిసిన నీరా కేఫ్‌లో రోజూ కనిపించే సందడే ఇందుకు నిదర్శనం. కాగా, ప్రతి రోజు 1300  నీరా బాటిల్స్‌ విక్రయిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఒక్కో బాటిల్‌ ధర రూ.90 ఉంది. ఈ లెక్కన రోజుకూ కేవలం నీరా మీదనే 1.17లక్షల ఆదాయం సమకూరుతున్నది. అయితే ప్రతి రోజు ఉదయం 11 గంటలకు నీరా కేఫ్‌ తెరుస్తుండగా మూడు, నాలుగు గంటల్లోనే బాటిల్స్‌ అమ్ముడుపోగా, వీకెండ్‌లో రెండు గంటల్లోనే మొత్తం నీరా అమ్ముడుపోవడం విశేషం. నీరా ఉత్పత్తిని మరింత పెంచాల్సినవసరం ఏర్పడిందంటే నగరవాసులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్‌ను అత్యాధునికంగా ఏర్పాటు చేయడంతో నీరా ప్రియుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)