వంట నూనె ధరల్లో తగ్గుముఖం !

Telugu Lo Computer
0


కరోనా కంటే ముందు వంట నూనెలు లీటర్‌ నూనె రూ. 100 లోపే ఉండేది. అయితే, కరోనా సమయంలో వంట నూనెల ధరలు బాగా పెరిగాయి. ఆ సమయంలో పామాయిల్‌ ధరలు లీటర్‌ రూ.170కి చేరుకున్నాయి. సన్‌ ఫ్లవర్‌, సోయాబిన్‌ లీటర్‌ నూనెలు రూ.180కి చేరువయ్యాయి. ఇంతలోనే ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం మొదలు కావడంతో వంట నూనెలు ధరలు ఆకాశన్నంటాయి. ఒక దశలో రూ. 200 మార్క్‌ను దాటాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం స్టాంప్‌ డ్యూటీని గతేడాది ఒకసారి, ఈ యేడాదిలో ఇటీవలే మరోసారి తగ్గించింది. దీనికితోడు అంతర్జాతీయంగా నూనెల ధరలు తగ్గడం మొదలు కావడంతో దేశంలో ధరలు అదుపులోకి వచ్చాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ రేట్లు పెరగకుండా తరచూ మిల్లుల్లో తనిఖీలు చేయడం, కల్తీలు లేకుండా చర్యలు తీసుకోవడంతో నూనెల ధరలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పామాయిల్‌ లీటర్‌ ధర రూ.99 కాగా, సన్‌ ఫ్లవర్‌, సోయాబిన్‌ ధర రూ.118-120 మధ్య ఉంది. వేరుశనగ నూనె మాత్రం ఇంకా తగ్గలేదు. మార్కెట్‌లో లీటర్‌ రూ. 173 వరకు ధర పలుకుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)