15 ఏండ్లుగా సిక్ లీవ్​లో ఉన్న ఉద్యోగి కంపెనీపై దావా !

Telugu Lo Computer
0


పదిహేనేండ్లుగా సిక్ లీవ్ లో ఉన్న ఓ ఉద్యోగి తన జీతం పెంచలేదంటూ కంపెనీపై దావా వేశాడు. అయితే, అతను పని చేయకపోయినా ఏడాదికి రూ. 55 లక్షల ఫిక్స్డ్ శాలరీ ఇస్తున్నారని, అది సరిపోతుందంటూ ఎంప్లాయ్ మెంట్ ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. బ్రిటన్ కు చెందిన ఇయాన్ క్లిఫోర్డ్ 2000 సంవత్సరంలో ఐబీఎం కంపెనీలో ఐటీ స్పెషలిస్ట్ గా చేరాడు. అనారోగ్య కారణాలతో 2008 నుంచి సిక్ లీవ్ లో వెళ్లాడు. తనకు గత ఐదేండ్లలో జీతం పెంచలేదని, హాలీడేస్ కు పేమెంట్ కూడా ఇవ్వలేదంటూ 2013లో కంపెనీని ఆశ్రయించాడు. దీంతో కంపెనీ అతనితో కాంప్రమైజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మెడికల్లీ రిటైర్డ్ ప్లాన్ కింద.. అతని జీతంలో 75% జీతాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. అతను కోలుకుని పని చేసేంతవరకూ లేదంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేంత వరకూ లేదంటే చనిపోయేంత వరకూ ఏది ముందైతే అంతవరకు ఏటా ఫిక్స్​డ్​ శాలరీ ఇచ్చేలా ఒప్పుకుంది. అయితే, ఏటా ధరలు పెరుగుతున్నా తన జీతం మాత్రం పెరగట్లేదని, ఇది డిజేబిలిటీ డిస్క్రిమినేషన్ కిందకు వస్తుందంటూ ఇయాన్ క్లిఫోర్డ్ 2022లో ఎంప్లాయ్ మెంట్ ట్రిబ్యునల్ లో దావా వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ఈ దావాను ఇటీవల తిరస్కరించింది. ''ఐబీఎంతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఇయాన్ వార్షిక జీతం 73 వేల పౌండ్లు(రూ. 73 లక్షలు). ఒప్పందం ప్రకారం ఏటా అందులో 75% జీతం 54 వేల పౌండ్లు (రూ. 55 లక్షలు) అందుకుంటున్నాడు. పని చేయకపోయినా ఉదారంగా ఇంత మొత్తం ఇస్తున్నారు. ఇది అతనికి సరిపోతుందని భావిస్తున్నాం' అని ట్రిబ్యునల్ జడ్జి పాల్ హూసెగో తీర్పు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)