తెల్ల ఉల్లిపాయ - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ఉల్లిపాయలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఉల్లిపాయను రోజు పచ్చిగానే తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యా దరిచేరదు. వాసన కొంచెం ఘాటుగా ఉన్నప్పటికీ వంటల రుచిని ఇది రెట్టింపు చేస్తుంది. అయితే సాధారణ ఉల్లిపాయల కంటే తెల్ల ఉల్లిపాయలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే తెల్ల ఉల్లిపాయలు కాస్త అరుదుగానే లభిస్తాయి.  క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. దీనిని ప్రారంభ దశలో గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదంగా మారగలదు. అయితే క్యాన్సర్‌ని నిరోధించడంలో తెల్ల ఉల్లిపాయలు ఉపయోగపడతాయి. ఇంకా ఇందులోని ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరడతాయి. ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే తెల్ల ఉల్లిపాయలు మొత్తం జీర్ణవ్యవస్థనే మెరుగుపరచడంతో పాటు అజీర్తి, మలబద్ధకం, కడుపు నొప్పి, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మధుమేహం ఉన్నవారికి తెల్ల ఉల్లిపాయలు ఒక వరమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రకమైన ఉల్లిపాయలు డయాబెటిక్ పేషెంట్స్‌లోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తెల్ల ఉల్లిపాయలలో ఉండే ఔషధ గుణాలతో సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలో ఉండే విటమిన్ సీ .. మన శరీర రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)