కాంగ్రెస్‌లోకి లక్ష్మణ్‌ సవాది ?

Telugu Lo Computer
0


కర్ణాటక బిజెపికి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవాది శుక్రవారం బెంగళూరులో రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు. సిద్ధరామయ్య స్వగృహంలో ఈ భేటీ జరిగింది. మే 10న జరగనున్న కర్ణాటక ఎన్నికలకు బిజెపి తన తొలి అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజు, లక్ష్మణ్‌ సవాది బుధవారం బిజెపి నుంచి వైదొలిగారు. దీంతో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి బిఎస్‌ యడియూరప్ప తర్వాత కర్ణాటకలో బిజెపికి చెందిన అత్యంత సీనియర్‌ లింగాయత్‌ నాయకులలో సవాది ఒకరు. ఆయన కాంగ్రెస్‌ లో చేరి ఆ పార్టీ టికెట్‌ పై బరిలో ఉంటారని చర్చ జరుగుతోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన లక్ష్మణ్‌ సవాది కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారు. తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానిపై ప్రకారం ముందుకు సాగుతానని ఆయన ప్రకటించారు. తాను ఆత్మగౌరవ రాజకీయ నాయకుడిని చెప్పారు.కాగా, సవాడి 2018 ఎన్నికల్లో అథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మహేష్‌ కుమత్తహళ్లిపై ఓడిపోయారు. ఒక సంవత్సరం తరువాత, కాంగ్రెస్‌-జనతాదళ్‌ సెక్యులర్‌ ప్రభుత్వం నుండి సామూహిక ఫిరాయింపుల్లో ఆయన కీలకంగా వ్యవహారించారు. అందుకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. ఈ ఫిరాయింపుదారుల్లో ఒకరైన మహేష్‌ కుమఠహళ్లి ఈసారి అథని నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తాను బరిలో దిగాలని సవాది భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)