వారసుడు కోసం భార్యను చంపిన భర్త !

Telugu Lo Computer
0


తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని వడ్లగూడెం గ్రామంలో ఈ నెల 10వ తేదీన అనుమానాస్పద మృతిగా భావించిన మౌనిక కేసును పోలీసులు ఛేదించి హత్య కేసుగా నమోదుచేశారు. సీఐ బాలకృష్ణ  వివరాలు వెల్లడించారు. కల్లూరుకు చెందిన మౌనికకు వడ్లగూడెం గ్రామానికి చెందిన చల్లా నాగేంద్రబాబుకు 11 ఏళ్ల కిందట వివాహం జరుగగా, వారికి 10 ఏళ్ల పాప ఉంది. వారసుడు జన్మించలేదనే కారణంగా కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ రాత్రి వారి మధ్య గొడవ మొదలైంది. దీంతో నాగేంద్రబాబు భార్యను కొట్టి, చీరతో ఊరి వేసి హత్యచేశాడు. హత్య అనంతరం ఆమెను కిందకు దింపి మంచం మీద పడుకోబెట్టి గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, నాగేంద్రబాబును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వాస్తవం వెలుగు చూసిందని సీఐ వివరించారు. మౌనిక హత్య విషయం తెలిసి కూడా చెప్పకుండా దాచినందుక నిందితుడి సోదరుడు చల్లా దిలీప్‌, తండ్రి చల్లా చెన్నారావును కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)