సీబీఐ రెండో ఛార్జ్ షీట్ దాఖలు !

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మనీష్ సిసోడియా, అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు, అమన్దీప్ దల్, అర్జున్ పాండేలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కాం కుంభకోణానికి సంబంధించి సీబీఐ రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రెండో ఛార్జ్ షీట్ లో మనీష్ సిసోడియా, బుచ్చిబాబుపై కీలక అభియోగాలు మోపింది. లిక్కర్ కేసుకు సంబంధించి దర్యాప్తులోని కీలక అంశాలను సీబీఐ రెండో ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. గత నవంబర్ లో సీబీఐ మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొదటి ఛార్జ్ షీట్ దాఖలు తరువాతే మనీష్ సిసోడియాను అరెస్టు చేయడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురిని ప్రశ్నించింది సీబీఐ. మనీష్ సిసోడియాను ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని శరత్ చంద్రారెడ్డి పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ప్రత్యేక కోర్టు.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 27వ తేదీన విచారణ జరపనుంది న్యాయస్థానం. ఏప్రిల్ 1న రౌస్ అవెన్యూ కోర్టు శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన భార్య ఆరోగ్యం సరిగా లేదని, కొన్ని ముఖ్యమైన విషయాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని ఆరు వారాల పాటు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని శరత్ చంద్రా రెడ్డి కోరారు. శరత్ చంద్రారెడ్డి భార్య అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  న్యాయస్థానం మానవతా కోణంలో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)