తెలంగాణలో మరో మూడు రోజులు పాటు వర్షాలు

Telugu Lo Computer
0


తెలంగాణలో మరో 3రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ వడగళ్లతో కూడిన వర్షాలు వాయవ్య తెలంగాణలోని ఒకటి, రెండు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ద్రోణి, గాలిలోని అనిశ్చితి పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ, ఇంటీరియల్‌ కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోందని వెల్లడించింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో ఏప్రిల్‌ 30, మే 1 తేదీల్లో పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కన్నా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)