ముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ సమర్థుడే !

Telugu Lo Computer
0


నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ  నేత అజిత్‌ పవార్‌కు అపారమైన పరిపాలన అనుభవం ఉందని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సమర్థుడని రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ అన్నారు. కానీ, కొందరుఅసమర్థులు చీలికలు తీసుకువచ్చి ముఖ్యమంత్రి అయ్యారంటూ ఏక్‌నాథ్‌ షిండేను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది జూన్‌లో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడంతో మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్యేకు ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వం వహించారు. అజిత్‌ పవార్‌ చాలాసార్లు మంత్రిగా పని చేశారు. ఉప ముఖ్యమంత్రిగా సైతం పలుసార్లు పని చేసిన అనుభవం ఉన్నది. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన వర్గీయులు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఎన్‌సీపీపై తిరుగుబావుటా ఎగుర వేసి 23 నవంబర్‌ 2019లో దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నవంబర్‌ 28న బల నిరూపరణకు ముందే రాజీనామా చేశారు. ఆ తర్వాత శివసేన కాంగ్రెస్‌, ఎన్‌సీపీతో కలిసి ప్రభుత్వానికి ఏర్పాటు చేసింది. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా.. అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పలు సందర్భాల్లో ముఖ్యమంత్రిని కావాలన్న తన కోరికను బయటపెట్టారు. ఈ క్రమంలో సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. పవార్‌ ఇప్పటికే పలుసార్లు ముఖ్యమంత్రిని కావాలన్న కోరికను వెలిబుచ్చారని, ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీతో కలిసి పవార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, బీజేపీతో ఎప్పటికీ ఎన్‌సీపీ పొత్తుపెట్టుకోదని శరద్‌ పవార్‌ థాకరేతో అన్నారని, ఎవరైనా పార్టీని వీడాలని నిర్ణయించుకుంటే వ్యక్తిగత విషయమన్నారని తెలిపారు. మరో వైపు తాను ఎన్‌సీపీని వీడడం లేదని, బతికునన్ని రోజులు ఎన్‌సీపీలోనే ఉంటానని అజిత్‌ పవార్‌ స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)