ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ భవన్‌ను మాకిచ్చేయండి !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ భవన్‌ను పూర్తిగా తమకు అప్పగించాలని తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులను కోరారు. దీనికి ప్రతిఫలంగా పటౌడీ హౌస్‌లో ఏడెకరాల భూమిని ఇవ్వాలని ప్రతిపాదించారు. అక్కడ కొత్త భవనం నిర్మించాలని సూచించారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఏపీ భవన్ రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తిగా కొనసాగుతోంది. ఏపీ-తెలంగాణ భవన్, ఇతర స్థిరాస్తుల విభజనపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోంశాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ఏప్రిల్ 26న రెండు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు ఈ ప్రతిపాదనను ఏపీ అధికారుల ముందు ఉంచారు. సమావేశం అనంతరం పటౌడీ హౌస్‌లోని స్థలాన్ని ఏపీ అధికారుల బృందం పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్‌ అధికారుల బృందంలో ఎస్‌ఎస్‌ రావత్‌, ఆదిత్యనాథ్‌ దాస్‌, ప్రేమచంద్రారెడ్డి, ఏపీ భవన్‌ అసిస్టెంట్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాన్షు కౌశిక్‌ ఉన్నారు. సమావేశానికి తెలంగాణ తరపున రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)