కోర్టు ఖర్చుల కోసం నీరవ్ మోడీ అగచాట్లు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 20 March 2023

కోర్టు ఖర్చుల కోసం నీరవ్ మోడీ అగచాట్లు !


నీరవ్ మోడీకి చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌డిఐపిఎల్) వద్ద రూ. 236 బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐకి రూ. 2.46 కోట్లు చెల్లించాల్సి ఉండగా,  బ్యాంక్‌ అకౌంట్‌లో కేవలం రూ.236 ఉన్నట్లు తెలుస్తోంది. మరి బ్యాంక్‌లకు నీరవ్‌ చెల్లించాల్సిన మొత్తాన్ని దర్యాప్తు సంస్థలు ఏ విధంగా వసూలు చేస్తాయో చూడాల్సి ఉంది. గత వారం భారత్‌కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు నీరవ్‌ను ఆదేశించింది. కానీ నీరవ్‌ మోదీ తన వద్ద అంత డబ్బు లేదని కోర్టుకు మొర పెట్టుకున్నాడు. దీంతో మరి విచారణ నిమిత్తం చెల్లించాల్సిన చట్టపరమైన ఖర్చుల్ని ఎలా చెల్లిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది. అందుకు అప్పగింత ప్రక్రియలో భాగంగా భారత్‌ తన ఆస్తులను స్వాధీనం చేసుకున్నందున, తనకు తగిన వనరులు లేవని, కోర్టుకు చెల్లించే మొత్తాన్ని ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటానని, రుణ దాత కోసం అన్వేషిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు.

No comments:

Post a Comment