చైనా నది మధ్యలో హైవే !

Telugu Lo Computer
0


చైనాలోని జింగ్‌షాన్‌ కౌంటీ, గుఫుచెన్‌ను షాంఘై, చెంగ్డు మధ్యలోని ప్రధాన హైవేతో అనుసంధానం చేయడానికి చైనా ప్రభుత్వం నది పొడవునా పలు వంతెనలతో 4.4 కిలోమీటర్ల హైవే నిర్మించింది. ఈ 'రివర్‌ హైవే'కు సమాంతరంగా ముందే రోడ్డు ఉంది. మరి నది మధ్యలో హైవే నిర్మించాల్సిన అవసరం ఏముందని అనుకొంటున్నారా? పాత రోడ్డును వెడల్పు చేయాలంటే కొత్తగా చాలా చోట్ల సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. కొండలు బద్దలు గొట్టాలి. ఇళ్లు ఖాళీ చేయించాలి. ఈ వ్యయ ప్రయాసలతో పోల్చుకుంటే నది మధ్యలో వంతెన నిర్మించడమే సులభమని చైనా ఇంజినీర్లు భావించారు. హుబీ ప్రావిన్స్‌లోని జియాంగ్జీ నది పలు వంపులు తిరుగుతూ పర్వతాల గుండా సాగుతుంది. సాధారణ హైవేతో పోలిస్తే ఈ మార్గంలో 'రివర్‌ హైవే' నిర్మించడం వల్ల వ్యయం బాగా తగ్గింది. మొత్తానికి రూ.585 కోట్లలో ఈ ప్రాజెక్టు పూర్తయింది. గత ఎనిమిదేళ్లలో ఈ 'రివర్‌ హైవే' ఓ పర్యాటక ప్రాంతంగానూ మారిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)