వేసవి - పానీయాలు !

Telugu Lo Computer
0


వేసవిలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. చాలామందికి త్వరగా నీరసం వచ్చేస్తుంది. ఉక్కపోతతో చెమటలు ఎక్కువగా పడతాయి. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడి దాహం వేస్తుంది. ఈ సమయంలో ఏదైనా శీతల పానీయాలను తాగాలని ఉంటుంది. కొంతమంది కూల్‌డ్రింక్స్‌ని తీసుకుంటుంటారు. కానీ, షుగర్ కంటెంట్ అధికంగా ఉన్న బేవరేజెస్ కన్నా షుగర్ ఫ్రీ పానీయాలను తీసుకోవడం చాలా మంచిది. రక్తంలో అధిక షుగర్ లెవెల్స్ కలిగిన డయాబెటిక్ పేషంట్లు తప్పనిసరిగా కొన్ని షుగర్ ఫ్రీ డ్రింక్స్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో డయాబెటిస్ పేషంట్లు ఈ బేవరేజెస్‌ తీసుకుంటే శరీర నీటి శాతంలో హెచ్చుతగ్గులు ఉండబోవని చెబుతున్నారు.  శరీరానికి నీరు చాలా అవసరం. కాబట్టి, వేసవిలో నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీటిని తాగుతుండాలి. దీనివల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాదు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా న్యూట్రల్‌గా ఉంటాయి. షుగర్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరించి శరీరంలోని ఎక్స్‌ట్రా గ్లూకోజ్‌ను యూరిన్ రూపంలో బయటకు పంపిస్తుంది. సహజంగా లభించే పానీయాల్లో కొబ్బరి నీళ్లు ఒకటి. ఇందులో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. కొబ్బరి నీరులో కొన్ని కెలోరీలు ఉంటాయి. పొటాషియం, అమైనో ఆసిడ్స్, ఎంజైమ్స్, బీ విటమిన్, మెగ్నీషియం, ఐరన్, తదితర ఎలక్ట్రోలైట్ లు ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరించడంలో కొబ్బరి నీరులోని పోషకాలు సహకరిస్తాయి. కొబ్బరి నీరులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ సర్కులేషన్ సాఫీగా సాగేలా కొబ్బరినీరు సహకరిస్తుంది. వేసవిలో నిమ్మరసం తప్పనిసరిగా తీసుకుంటారు. షుగర్ లేకుండా తీసుకోవడం మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై నిమ్మరసం ఎలాంటి ప్రభావం చూపబోదు. డయాబెటిస్ పేషంట్లకు ఇది ఎంతో ఉపయోగకరం. దీనిని సాల్టెడ్ లస్సీ అని కూడా పిలుస్తుంటారు. రెగ్యులర్‌గా అందుబాటులో ఉండే పానీయాలల్లో బటర్ మిల్క్ ఒకటి. ఇది కేవలం పానీయమే కాదు. శరీరానికి ఒక క్యాటలిస్ట్‌లా పనిచేస్తుంది. మెదడును కాస్త ఉత్తేజం కలిగిస్తుంది. సులువుగా ఈ బటర్ మిల్క్‌ని తయారు చేసుకోవచ్చు. పెరుగు, బ్లాక్ సాల్ట్, పుదీనా రెమ్మలు, జీలకర్ర పొడితో కలిపి ఈ సాల్టెడ్ లస్సీని రెడీ చేసుకోవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ని కూడా నియంత్రణలోకి తెస్తుంది. వేసవి ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం పొందడానికి ఈ జల్‌జీరా చక్కగా ఉపయోగ పడుతుంది. ఇందులో ఎలాంటి షుగర్స్ ఉండకపోవడం విశేషం. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. మెటబాలిజంను పెంపొందిస్తుంది. డయాబెటిస్ పేషంట్లకే కాక ఇతరులకు కూడా ఇది మంచి పానీయం. పుదీనా ఆకులు, జల్‌జీరా పౌడర్, జీలకర్ర, అల్లంతో దీనిని తయారు చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)