విరాట్ కోహ్లీ ఆహార నియమాలు !

Telugu Lo Computer
0


విరాట్ కోహ్లీ పెరుగు, పాల ఉత్పత్తులు, గోధుమ పిండి చపాతీలు తినడు. వాటికి దూరంగా ఉంటాడు. విరాట్ తన ఆహారంలో కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోడు. ఇది శరీరం కొవ్వును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇందుకోసం విరాట్ కోహ్లీ వివిధ పదార్థాలతో చేసిన బ్రెడ్ మాత్రమే తింటాడు. మామూలు అన్నం కాకుండా స్పెషల్ రైస్ తింటారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఈ బియ్యాన్ని ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. గ్లూటెన్ రహితంగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఈ బియ్యం సాధారణ రుచిని కలిగి ఉంటుంది. ఈ బియ్యం కిలో ధర రూ.400 నుంచి 500 వరకు ఉంటుందని సమాచారం. ఫిట్ నెస్ కోసం చాలా విషయాల్లో రాజీ పడాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాట్ తెలిపాడు. ఫిట్ నెస్ కోసం తాను చాలా స్వీట్లు కూడా తినడం మానేశానని తెలిపారు. ఇది మరింత ఫిట్‌గా ఉండటానికి సహాయపడిందని అతను తన ఫిట్‌నెస్ గురించి సమాచారం ఇచ్చాడు. 34 ఏళ్ల వయసులో కూడా కోహ్లి చాలా ఫిట్‌గా, బాగానే మెంటైన్ చేస్తున్నాడు. కోహ్లికి చాలా ఇష్టమైన ఫుడ్స్‌లో చోలే బట్టర్ ఒకటి. అయితే తన ఆటపై, తన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించే కోహ్లి.. చోలే బాటూర్‌ తినడం కూడా తగ్గించినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)