హాలీవుడ్‌ నటుడు పాల్‌ గ్రాంట్‌ కన్నుమూత !

Telugu Lo Computer
0


ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, 'హ్యారీ పోటర్‌' ఫేం పాల్‌ గ్రాంట్‌ కన్నుమూశారు. లండన్‌లోని రైల్వే స్టేషన్‌ వద్ద కుప్పకూలి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మార్చి 16వ తేదీన నార్త్‌ లండన్‌లోని కింగ్స్‌ క్రాస్‌ స్టేషన్‌ వెలుపల పాల్‌ గ్రాంట్‌ ఒక్కసారిగా తూలి పడిపోయాడు. అతన్ని గుర్తించిన పోలీసులు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాల్‌ గ్రాంట్‌ను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాల్‌ గ్రాంట్‌ తుదిశ్వాస విడిచారు. పాల్‌ గ్రాంట్‌ మృతి వార్త తెలుసుకున్న పలువురు హాలీవుడ్‌ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. 1980లో సినీ రంగ ప్రవేశం చేసిన పాల్‌ గ్రాంట్‌ .. విల్లో, లైబరన్త్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హ్యారీ పోటర్, స్టార్ వార్స్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ సంపాదించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)