రాహుల్ ఏం నేరం చేశాడు !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన సత్యాగ్రహంలో కాంగ్రెస్ నేత, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ  సత్యాగ్రహంలో పాల్గొని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఏం నేరం చేశారని ఆమె కేంద్రాన్ని నిలదీశారు. బీజేపీ పలుమార్లు గాంధీ కుటుంబాన్ని అవమానించినా తాము మౌనంగా భరించామని అన్నారు. సత్యాగ్రహంలో ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేష్ వంటి సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాహుల్‌పై అనర్హత వేటును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్నాటకలోని కోలార్‌లో రాహుల్ మాట్లాడుతూ దొంగలందరికీ మోదీ ఇంటిపేరే ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలకు గాను రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించడంతో లోక్‌సభ సెక్రటేరియట్ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. పార్లమెంట్ వేదికగా అదానీ-మోదీ బంధాన్ని రాహుల్ బట్టబయలు చేయడంతోనే ఆయనను అణిచివేసేందుకు అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీ సర్కార్‌పై మండిపడుతున్నాయి. మోదీ సర్కార్ తనను వెంటాడినా తాను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని, ధైర్యంగా గొంతెత్తుతానని రాహుల్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)