ఫుడ్ పాయిజన్ తో వంద మందికి పైగా అస్వస్థత

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ లోని సౌత్ 24 పరగణాస్ లోని ఓ మసీదులో ముస్లింలు ఉపవాసాన్ని విరమించడానికి పళ్లు తీసుకున్నారు. తిన్న కొద్దిసేపటికే వంద మందికిపైగా అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వీరు కొల్ కతా లోని వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఇఫ్తార్ తిన్న వారిలో ఒకరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని డాక్టర్లు తెలిపారు. "నిన్న రాత్రి, వాంతులు, కడుపు నొప్పితో కొంతమంది అనారోగ్యంతో నా నర్సింగ్‌హోమ్‌లోకి వచ్చారు. రోజా తర్వాత వారు భోజనం చేసిన ఇఫ్తార్ విందులో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఈ సంఘటన జరిగిందని మేము భావిస్తున్నాము" అని డాక్టర్ హోరిసాధన్ మోండల్ చెప్పారు. శుక్రవారం ఈ ఘటన జరగగా శనివారానికి కేసులు పెరిగినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)