లడఖ్ అడవుల్లో ఓ అరుదైన జంతువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బలమైన పిల్లి ఆకారం, కొమ్ముల్లాంటి చెవులతో ఈ జంతువు ఉంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఆ జంతువుకు సంబంధించిన వీడియోను ట్వి్ట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ జంతువును హిమాలయన్ లింక్స్ అని పిలుస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి జంతువును భారత్ లో చూడలేదని, మొదటిసారి ఇక్కడ గుర్తించినట్లు తెలిపాడు. లింక్స్ జంతువులు అడవి పిల్లుల జాతికి చెందినవి. ఇలాంటి జంతువులు ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ జాతుల్లో నాలుగు రకాలుంటాయి. వాటిని యురేషియన్, ఐబీరియన్, కాండా లింక్స్ మరియు బాబ్ క్యాట్స్ అని పిలుస్తారు.
No comments:
Post a Comment