బావిలో పడ్డ శ్వేత నాగును కాపాడిన గ్రామస్తులు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 1 March 2023

బావిలో పడ్డ శ్వేత నాగును కాపాడిన గ్రామస్తులు !


ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం రేగ గ్రామం సమీపంలో రాతికొండ ప్రదేశంలో గుహలింగేశ్వరస్వామి గుడి ఉంది. ఈ ఆలయ ఆవరణలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు ఒక శ్వేత నాగు పడిపోయింది. బావి నుండి బయటకు రావడానికి నానా అవస్థలు పడుతూ లోపల లోపలే కొట్టుకుంటూ ఉండిపోయింది. ఉదయాన్నే పొలం పనులకు అటుగా వెళ్తున్న రైతులు బావిలో శ్వేతనాగు చేస్తున్న ప్రయతాన్ని గమనించి, ప్రాణాలకు తెగించి మరీ పామును కాపాడేందుకు సిద్ధమయ్యారు. వెదురుబొంగులు, తాళ్లు వేసి చాకచక్యంగా బయటకు తీశారు. సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న శ్వేతనాగు బావి నుండి బయటకు రాగానే ఒక్కసారిగా బుసలు కొడుతూ పడగ విప్పిoది. దీంతో గ్రామస్తులు మొదట భయపడ్డారు. గ్రామస్తులు శ్వేతనాగుతో ఫోటోలు దిగి, అనంతరం కొండ ప్రాంతం వైపు పంపించేశారు. 

No comments:

Post a Comment