మహారాష్ట్రలో రైతులు మళ్లీ పోరుబాట !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో తమ సమస్యలు తొలగించాలని డిమాండ్​ చేస్తూ రైతులు, గిరిజనులు నాసిక్​ జిల్లాలోని దిన్దోరి టౌన్​ నుంచి ముంబై వరకు 200 కిలోమీటర్ల మార్చ్ ను రైతులు మళ్లీ పోరుబాట మొదలుపెట్టారు. ఈ భారీ ర్యాలీలో వేలాది మంది రైతులు, గిరిజనులు పాల్గొంటున్నారు. వీరికి మద్దతుగా సీపీఎం, రైతు సంఘాలు మద్దతునిస్తున్నాయి. ఈ పోరాటంలో వృద్ధులు కూడా పాల్గొన్నారు. తమ డిమాండ్లను వెల్లడిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఒంట్లో శక్తి లేకపోయినా, చెప్పులు తెగిపోయి పాదాలనుంచి రక్తం కారినా యాత్ర మాత్రం ఆపడంలేదు. అస్వస్థకు గురైనవాళ్ల కోసం ఆంబులెన్స్ వచ్చినా అందులో వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. ఏది ఏమైనా మా డిమాండ్ల నెరవేరే వరకు పాదాయాత్ర ఆపమని తేల్చి చెప్తున్నారు. మహారాష్ట్రలో ఉల్లి ధర దారుణంగా పడిపోవడంతో ఉల్లి రైతులకు క్వింటాల్​కు రూ.600 తక్షణ సాయం, 12 గంటల పాటు ఉచిత కరెంట్​ సరఫరా, వ్యవసాయ రుణాల రద్దు.. తదితర డిమాండ్లతో ఈ మార్చ్ మొదలైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)