బ్లెస్సీ వైద్య ఖర్చులు భరిస్తాం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామ కార్యకర్త బిఆర్‌ఎస్‌కు చెందిన నల్లగటి సుందర్ కుటుంబ సభ్యులు ఈ నెల 20న స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో సుందర్ కొడుకు శ్యామ్ (5) అక్కడికక్కడే మృతి చెందగా కూతురు బ్లెస్సీ (3) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హైదరాబాద్‌లో దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చిన్నారికి దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ విషయాన్ని రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, కొనరెడ్డి ఏడుకొండల్ ద్వారా సహాయం కోసం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి కెటిఆర్ చిన్నారి వైద్య ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చినట్లు బ్లెస్సీ కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి బృందం తమకు ఫోన్ చేసిన మాట్లాడినట్లు వారు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)