మిథునం నిర్మాత కన్నుమూత ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 March 2023

మిథునం నిర్మాత కన్నుమూత !


మిథునం వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన మొయిద ఆనందరావు (57) కన్నుమూశారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న ఆయన కొంత కాలంగా వైజాగ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభిచారు. ఆ తర్వాత వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. సంఘసేవకుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. అందుకే తన స్వగ్రామంలో రూ.25 లక్షలు ఖర్చు చేసి ఓ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. సాహిత్యంపై కూడా ఆనందరావుకు మక్కువ ఎక్కువ. పర్యావరణ హిత పద్యాలను రాసి కోటిగాడు పేరుతో ప్రచురించేవారు. ఇక సినిమాల విషయానికొస్తే 2012లో మిథునం సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ కీలక పాత్రల్లో నటించారు. తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకుడు. కేవలం రెండే పాత్రలతో నడిచే ఈ సినిమా విమర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2017లో మిథునం చిత్రానికి నంది అవార్డు కూడా వరించింది. ఆనందరావు విషయానికొస్తే ఆయనకు భార్య పద్మినితో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

No comments:

Post a Comment