ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు మాఫీ !

Telugu Lo Computer
0


ఆధార్ అప్‌డేట్ చార్జీలను తొలగిస్తున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. కొంత కాలం వరకే ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండనుంది. ఆధార్ కార్డు కలిగిన వారు ఆధార్ సెంటర్‌కు వెళ్లి కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తే మాత్రం చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. రూ. 50 చార్జీ పడుతుంది.  ఈ ఉచిత ఆధార్ అప్‌డేట్ సదుపాయం మూడు నెలల వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. 2023 మార్చి 15 నుంచి 2023 జూన్ 14 వరకు ఉచిత అప్‌డేట్ ఫెసిలిటీ పొందొచ్చని వివరించింది. ఆధార్ కార్డు పొంది పదేళ్లు అయ్యి ఉంటే.. ఇప్పటి వరకు ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోకపోతే.. ఇప్పుడు మీరు ప్రూఫ్ ఐడెంటిటీ అప్‌లోడ్ చేసి ఆధార్ వివరాలు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదని యూఐడీఏఐ ట్వీట్ చేసింది. అందువల్ల మీరు ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తే.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఉచితంగానే ఆధార్ వివరాలను మార్చుకోవచ్చు. లేదంటే తర్వాత చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)