హైవేపై వెదురుతో క్రాష్ బ్యారియర్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 4 March 2023

హైవేపై వెదురుతో క్రాష్ బ్యారియర్


'పర్యావరణ హితం' దిశగా మహారాష్ట్ర సరికొత్త ప్రపంచ రికార్డును సొంతం చేసుకోనుంది. కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇందుకోసం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టుంది. పూర్తిగా వెదురుతో తయారు చేసిన 200 మీటర్ల పొడవైన క్రాష్ బారియర్‌ను మహారాష్ట్ర హైవేపై ఏర్పాటు చేసింది. ఈ తరహాలో క్రాషి బారియర్ ఏర్పాటు చేయడటం ప్రపంచంలోనే ఇది మొదటిదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. మహారాష్ట్రలోని చంద్రపూర్-యవత్మాల్ జిల్లాలను అనుసంధానించే హైవేపై ఈ బాంబూ క్రాష్ బారియన్‌ను ఏర్పాటు చేశారు. ''ఇది దేశం, వెదురు రంగానికి గొప్ప విజయం. వణి-వరోరా హైవేపే ప్రపంచంలోనే మొట్టమొదటి 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్ బ్యారియర్‌తో అత్మనిర్భర్ భారత్‌ను సాధించే దిశగా అసాధారణ విజయం సాధించాం'' అని నితిన్ గడ్కరి వరుస ట్వీట్లలో తెలిపారు. ఇలాంటి నిర్మాణం ప్రపంచంలోనే మొదటిదని, ఈ క్రాష్ బ్యారియర్ ఉక్కుకు సరైన ప్రత్నామ్యాయమని, పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు. వెదురు క్రాష్ బారియర్ రీసైక్లింగ్ విలువ 50 నుంచి 70 శాతం, ఉక్కు బారియర్ల రీసైక్లింగ్ విలువ 30 నుంచి 50 శాతం ఉందని చెప్పారు. బాంబుసా బాల్కోవా వెదురుకు క్రియేసాట్ నూనెతో శుద్ధి చేసి రీసైకిల్డ్ హై-డెన్సిటీ పోలీ ఇథిలీన్ (HDPE)తో పూత పూసి తయారు చేసినట్టు చెప్పారు. ఇది ఉక్కుకు ప్రత్యామ్నాయమే కాకుండా, పర్యవారణ ఆందోళనలకు పరిష్కారమని అన్నారు. వెదురు రంగంతో పాటు యావత్ భారతదేశం గుర్తించిదగని విజయం ఇదని తెలిపారు. గ్రామీణ, అగ్రికల్చర్-ఫ్రెండ్లీ ఇండస్ట్రీగా ఇది మరింత కీలకమైన మైలురాయని గడ్కరి అభివర్ణించారు. వెదురు క్రాష్ బ్యారియర్‌కు 'బాహుబలి' అనే నామకరణం చేసినట్టు గడ్కరి మరో ట్వీట్‌లో తెలిపారు. ఇండోర్‌ పితాంబర్‌లోని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ వంటి పలు ప్రభుత్వ సంస్థలతో ఇది కఠినమైన పరీక్షలు ఎదుర్కొందని, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఫైర్ రేటింగ్ పరీక్షల్లో క్లాస్-1 రేటింగ్ సాధించిందని చెప్పారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ గుర్తింపు సైతం పొందినట్టు మరో ట్వీట్‌లో తెలిపారు. వెదురు క్రాష్ బారియర్ రీసైక్లింగ్ విలువ 50 నుంచి 70 శాతం, ఉక్కు బారియర్ల రీసైక్లింగ్ విలువ 30 నుంచి 50 శాతం ఉందని చెప్పారు. బాంబుసా బాల్కోవా వెదురుకు క్రియేసాట్ నూనెతో శుద్ధి చేసి రీసైకిల్డ్ హై-డెన్సిటీ పోలీ ఇథిలీన్ తో పూత పూసి తయారు చేసినట్టు చెప్పారు. ఇది ఉక్కుకు ప్రత్యామ్నాయమే కాకుండా, పర్యవారణ ఆందోళనలకు పరిష్కారమని అన్నారు. వెదురు రంగంతో పాటు యావత్ భారతదేశం గుర్తించిదగని విజయం ఇదని తెలిపారు. గ్రామీణ, అగ్రికల్చర్-ఫ్రెండ్లీ ఇండస్ట్రీగా ఇది మరింత కీలకమైన మైలురాయని గడ్కరి అభివర్ణించారు. 

No comments:

Post a Comment