శుక్ర, బృహస్పతి గ్రహాల అద్భుత సంయోగం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 21 February 2023

శుక్ర, బృహస్పతి గ్రహాల అద్భుత సంయోగం !


వాతావరణం అనుకూలిస్తే ఈ వారం పశ్చిమ దిక్కున రెండు భారీ ప్రకాశవంతమైన గ్రహాల అద్భుత సంయోగాన్ని స్పష్టంగా సందర్శించవచ్చు. బృహస్పతి, శుక్రుడు ఈ రెండు గ్రహాల సంయోగ దృశ్యం సాక్షాత్కరిస్తుంది. సూర్యాస్తమయం తరువాత పశ్చిమ దిక్కు ఆకాశంలో ఈ రెండు గ్రహాలు కలుస్తాయి. రెండు గ్రహాల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో నెలవంక వెండి వెలుగు రేఖ సన్నగా కనిపిస్తుంది. లండన్ నుంచి పశ్చిమ వైపు ఫిబ్రవరి 22 నాడు 1800 జిఎంటి ( గ్రీన్‌విచ్ సమయం) సమయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు చూడవచ్చు. ఆ సమయంలో ఆమేరకు ఆకాశ భాగంలో ఇతర నక్షత్రాలేవీ కనిపించవు. సాయం సమయంలో ఈ గ్రహాలు రెండూ ఒకదానితో ఒకటి పోటీలా అత్యంత ప్రకాశవంతంగా నిల్చుంటాయి. చంద్రుడూ తన ఉపరితలం ప్రకాశం కన్నా 8 శాతం ఎక్కువగా ప్రకాశిస్తుంటాడు. ప్రపంచం మొత్తం మీద నక్షత్ర సందర్శకులు ఈగ్రహాల అద్భుత సంయోగాన్ని చూడగలుగుతారు. కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా, నుంచి పశ్చిమ వైపు 2000 ఎస్‌ఎఎస్‌టి సమయంలో ఫిబ్రవరి 22న చూడగలుగుతాం. సిడ్నీ, ఆస్ట్రేలియా, ప్రాంతీయులు ఫిబ్రవరి 23న పశ్చిమాన 2000 ఎఇడిటి సమయంలో ఈ గ్రహ సంయోగం కనిపిస్తుంది. బృహస్పతి మీదుగా చంద్రుడు ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ ప్రకాశంతో ఉంటాడు. వచ్చేవారం అంతా ఈ రెండు గ్రహాలు మరింత చేరువవుతాయి.

No comments:

Post a Comment