జ్వరం వచ్చిన వెంటనే ట్యాబ్లెట్లు వేయొద్దు !

Telugu Lo Computer
0


కొంతమంది తల్లిదండ్రులు, పిల్లలకు కాస్త జ్వరం వచ్చినా సిరప్ లు, మాత్రలు వేస్తుంటారు. వారి శరీరంలోని ఉష్ణోగ్రతలను తగ్గించడానికి పలు రకాల మందులను ఉపయోగిస్తుంటారు. అయితే అలా జ్వరం వచ్చిన వెంటనే ట్యాబ్లెట్లు వాడటం మంచిది కాదని అమెరికాలోని మిషిగన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ముగ్గురు తల్లిదండ్రులలో ఒకరు జ్వరం తగ్గించడంలో భాగంగా పారాసెటమాల్‌ వంటి మాత్రలు వాడుతున్నారని ఓ సర్వేలో తేలింది. పిల్లల శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల ఫారెన్‌హైట్‌ లోపే ఉన్నా కూడా ... కొందరు తమ పిల్లలకు జ్వర మాత్రలు వాడుతున్నారట. ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం మళ్లీ రాకుండా రెండో డోసు ఇస్తున్నారని సర్వే చెబుతోంది. అయితే ఇలాంటి చిన్న జ్వరాలను వాటంతటవే తగ్గనివ్వాలని పరిశోధకులు సూచిస్తు్న్నారు. పిల్లల ఒళ్లు వెచ్చబడటమనేది రోగంపై పోరాడే క్రమంలో జరుగుతుందని అంటున్నారు. జ్వరాన్ని తగ్గించినంత మాత్రాన వారు బాగానే ఉన్నారనుకోవద్దని, ఈ సమయంలో పిల్లలకు మరీ ఎక్కువ మందులు ఇస్తే దుష్పలితాలు వస్తాయని చెబుతున్నారు. ఎక్కువమంది తల్లిదండ్రులు పిల్లల నుదుటి మీద కానీ, నోట్లో కానీ థర్మామీటర్‌ ఉంచి జ్వరాన్ని నమోదు చేస్తారు. ప్రతి ఆరుగురిలో ఒకరు చంకలో కానీ, చెవిలో కానీ ఈ పరికరాన్ని ఉంచి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు. నిజానికి నుదుటి మీద లేదా చెవిలో సరైన పద్ధతిలో థర్మామీటర్‌ను వాడితే కచ్చితమైన ఫలితాలు వస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)