వీధికుక్కల దాడిలో బాలుడు మృతి ఘటన తీవ్రంగా కలచివేసింది

Telugu Lo Computer
0


హైదరాబాద్ అంబర్‌పేటలో జరిగిన ఘటనలో నాలుగేళ్ల బాలుడి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని కేటీఆర్ అన్నారు. బాలుడు మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నగరంలో వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘట నలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మున్సిపాలిటీలో వీధి కుక్కల సమస్యను వీలైనంత తర్వగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియం త్రణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపడుతున్నామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)