ఐఎంఎఫ్‌తో పాకిస్తాన్ చర్చలు విఫలం

Telugu Lo Computer
0


ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్, ఐఎంఎఫ్ బెయిలౌట్ సాయంతో బయటపడవచ్చని భావించింది. ఇప్పటికే మిత్రదేశాలు అప్పు ఇవ్వలేమని చెప్పడంతో చివరి అవకాశంగా ఐఎంఎఫ్ తో గత పది రోజుల నుంచి పాక్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఐఎంఎఫ్ ఇచ్చే ఆర్థిక సాయంతో బయటపడవచ్చని భావించింది. అయితే ఐఎంఎఫ్ తో పాక్ ప్రభుత్వం చర్చలు విఫలం అయినట్లు అక్కడి మీడియా చెబుతోంది. బెయిలౌట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో ఒప్పందం చేసుకోవడంలో పాకిస్తాన్ విఫలం అయినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ద్రవ్యల్భణం, దిగుమతుల సంక్షోభం, విదేశీమారక నిల్వలు పడిపోతున్న క్రమంలో ఐఎంఎఫ్ ప్యాకేజీతో కోలుకోవచ్చని పాక్ భావించింది. పదిరోజుల తర్వాత ఐఎంఎఫ్ ప్రతినిధుల బృందం శుక్రవారం దేశం నుంచి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒప్పంద గురించి పాక్ ప్రభుత్వం ఏలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అక్కడి స్థానిక మీడియా ఒప్పందం విఫలం అయినట్లు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఇటీవల పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఐఎంఎఫ్ షరతుల గురించి మాట్లాడుతూ ఊహకు అందని విధంగా షరతులు ఉన్నాయని, కానీ పాకిస్తాన్ వీటికి తలొగ్గాల్సిందే అని అన్నారు. తీవ్ర ద్రవ్యోల్భనం, ఆహార పదార్థాలు దొరక్క పాక్ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఐఎంఎఫ్ షరతులకు అంగీకరిస్తే అక్కడి ప్రజలు మరింతగా సమస్యల్లో కూరుకుపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యుత్ టారిఫ్ పెంచడం, పెట్రోల్ ధరలు పెంచడం, సబ్సిడీలను ఎత్తేయడం, పన్నులను పెంచడం వంటి షరతులను ఐఎంఎఫ్ విధిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ షరతులకు అంగీకరిస్తే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశం ఉందని పాలక ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 2.9 బిలియన్ డాలర్ల విదేశీమారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి కేవలం 10 రోజలు దిగుమతులకే సరిపోతాయి. ఆ తరువాత పాక్ పూర్తి దివాళా స్థితిలోకి చేరుకుంటుంది. మరోవైపు మిత్రదేశాలు అయిన యూఏఈ, సౌదీ, చైనాలు తమను ఆదుకోవాలని పాక్ కోరుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)