మహిళా కానిస్టేబుల్‌ను చంపిన ప్రియుడు

Telugu Lo Computer
0


బీహార్ లోని కతిహార్‌, భట్వారా గ్రామంలో ప్రభ కుమారి అనే కానిస్టేబుల్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ప్రభకు చోటు అలియాస్ అర్షద్‌తో మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి చోటును ప్రభ దూరంగా పెట్టడంతో ఆమెను అతడు పలుమార్లు బెదిరించాడు. ఆమెను చంపేస్తానని ఫోన్‌లో అతడు పలుమార్లు బెదిరించారని ప్రభ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. చోటు ప్రభ తలపై గన్‌తో కాల్చడంతో ఆమె ఘటనా స్థలంలో చనిపోయింది. నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడితో సహా ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కతిహార్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)