చెన్నై విమానాశ్రయంలో కొత్త సాఫ్ట్‌వేర్‌

Telugu Lo Computer
0


ముంబై తర్వాత చెన్నై విమానాశ్రయంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ యాప్‌ ద్వారా గంటలకు 45 విమాన సేవలు నడుపనున్నారు. ఈ కొత్త యాప్‌ అమలుతో విమానాల కోసం ప్రయాణికులు వేచి ఉండాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. విమాన రాకపోకల్లో జాప్యాన్ని నివారించేలా ఎయిర్‌పోర్ట్‌ కొలాబొరేటివ్‌ డెసిషన్‌ మేకింగ్‌ (ఏ-సీడీఎం) అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ పరిచయం చేశారు. ఈ యాప్‌తో విమానాశ్రయ కంట్రోల్‌ రూం అధికారులు, విమాన భద్రతా శాఖ, విమాన సంస్థల అధికారులు, గ్రౌండ్‌ స్టాఫ్‌, ఎయిర్‌ కంట్రోలింగ్‌ అధికారులు ఏకకాలంలో సంయుక్తంగా నిర్ణయం తీసుకొనే అవకాశముంది. పార్కింగ్‌ నుంచి విమానం ఎప్పుడు బయటకు తీసుకొస్తారు, విమానం రన్‌వేపైకి వెళ్లే సమయం, టాక్సీలో ప్రయాణికులు వేచి ఉండకుండా సత్వరం విమానంలోకి వెళ్లడం తదితరాలను ఈ యాప్‌ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. దీంతో విమానం కోసం ప్రయాణికులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఈ విషయమై విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ... ముంబై తర్వాత చెన్నై విమానాశ్రయంలో ఏ-సీడియం పరిచయం చేశామన్నారు. ప్రస్తుతం గంటకు 35 విమానాలు రాకపోకలు సాగిస్తుండగా, ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ పరిచయంతో గంటకు 45 విమానాలు వెళ్లేందుకు సాధ్యమవుతుందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)