12 రోజుల్లో 16 మందిని చంపిన ఏనుగు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 21 February 2023

12 రోజుల్లో 16 మందిని చంపిన ఏనుగు !


ఝార్ఖండ్ లోని అయిదు జిల్లాలైన హజారీబాగ్, రామ్‌గఢ్, చతరా, లోహర్‌దగా, రాంచీ జిల్లాల్లో ప్రజలను ఏనుగు హడలెత్తిస్తోంది. ఈ ఏనుగు బీభత్సంతో 12 రోజుల్లో 16 మంది చనిపోయారు. ఏనుగు దాడిలో మరణించిన కుటుంబాలకు రూ. 4లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఝార్ఖండ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికుమార్ సామంతా తెలిపారు. అయితే, ఏనుగును అడవుల్లోకి తరలించేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నట్లు తెలిపారు. ఏనుగు భారి నుండి మరింత ప్రాణనష్టం నివారించడానికి అధికారులు ఆయా జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడ వద్దని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం ఒక్కరోజే రాంచీ జిల్లాలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని ఏనుగు  చంపడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సోమవారం లోహర్‌దగా జిల్లాలో ఇద్దరు మహిళలపై ఏనుగు దాడిచేసి హతమార్చింది. అంతకుముందు రోజు ఆదివారం ఒకరిని తొక్కి చంపించిందని అధికారులు తెలిపారు. 12 రోజుల క్రితం ఇదే ఏనుగు హజరీబాగ్ లో ఐదుగురిని చంపి, ఆపై రామ్‌ఘర్‌కు వెళ్లి అక్కడ గోలా ప్రాంతంలో ఒక వ్యక్తిని తొక్కి చంపినట్లు రాంచీ డీఎఫ్‌ఓ తెలిపారు. మొత్తం 12 రోజుల నుంచి ఈ ఏనుగు ఏకంగా 16 మందిపై దాడిచేసి వారి చావుకు కారణమైందని అధికారులు తెలిపారు. 

No comments:

Post a Comment