మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గంజాయి బ్యాచ్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 17 February 2023

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గంజాయి బ్యాచ్


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్యం, గంజాయి మత్తులో విచక్షణారహితంగా ఓ గ్యాంగ్‌ ప్రవర్తించింది. మహిళపై దాడి చేసి దుస్తులు చించివేసింది.  స్థానిక రంగిరీజు వీధికి చెందిన ఓ కుటుంబం రాత్రి 9:30 గంటల సమయంలో ఓ ఫంక్షన్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో వారిని అడ్డుకుని  ఓ మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించారు. భర్త, సోదరుడి కళ్లు ముందే ఆకతాయిలు ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించారు. ఈ ఘటనను జీర్ణించుకోలేని భర్త, సోదరుడు.. మత్తు బాబులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడి చేసి, పిడి గుద్దులతో విరిచుకుపడి తీవ్రంగా గాయపరిచారు.. అయితే, ఈ ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.  దీంతో కేసు నమోదు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

No comments:

Post a Comment