నిలిచిన డిస్నీ+ హాట్ స్టార్ సేవలు

Telugu Lo Computer
0


దేశంలో డిస్నీ+ హాట్ స్టార్  సేవలు  డౌన్ అయ్యాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు యాప్ ఓపెన్ కావడం లేదని చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. Downdetector.in సైతం ఈ విషయాన్ని నివేదించింది. వేలాదిగా యూజర్లు సైతం ఎర్రర్ స్క్రీన్ షాట్లను ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. డిస్నీ+ హాట్‌స్టార్ ఈ విషయంపై స్పందించింది. యాప్‌లు మరియు వెబ్‌లో సేవలో ఊహించని సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి తమ టెక్ బృందం పని చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ సందర్భంగా OTT మరియు లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ సేవలు నిలిచిపోయాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)