ఆఫీసుకి టైముకి రాకపోతే ?

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో సాఫ్ట్ గ్రిడ్ కంప్యూటర్స్ ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులు తరచూ షిఫ్ట్ టైముకి రావట్లేదు. ఓ పావు గంట, అరగంట లేటుగా వస్తున్నారు. ఎందుకూ అని అడిగితే ట్రాఫిక్ జామ్, రోడ్లపై ఆంక్షలు అంటూ రకరకాల కారణాలు చెబుతున్నారు. ఇలాగైతే సమస్యే అనుకున్న యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది. తన సమస్యకు సాఫ్ట్‌వేర్ ద్వారానే సమాధానం చెప్పాలని ఆ కంపెనీ యాజమాన్యం భావించింది. ఉద్యోగులు పనిచేసే కంప్యూటర్లలో ప్రత్యేక టైమ్ ట్రాకర్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసింది. ఎవరైనా ఉద్యోగి షిఫ్ట్ టైమ్ దాటాక ఆఫీసుకి వచ్చి.. కంప్యూటర్ ఆన్ చేస్తే వెంటనే స్క్రీన్‌పై వార్నింగ్ మెసేజ్ కనిపిస్తుంది. "నీ షిఫ్ట్ టైమ్ దాటిపోయింది. ఆఫీస్ సిస్టం పది నిమిషాల్లో క్లోజ్ అవుతుంది. దయచేసి ఇంటికి వెళ్లిపోండి" అని మెసేజ్ చూపిస్తుంది. దాంతో ఆ ఉద్యోగి పనిచేసే అవకాశం ఉండదు. ఇంటికి వెళ్లక తప్పదు.  ఈ కొత్త సాఫ్ట్‌వేర్ చూసి ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ఇదెక్కడి సాఫ్ట్‌వేర్ అని హడలిపోతున్నారు. పొరపాటున తాము లేటుగా వస్తే తమకు ఆ రోజు పని ఉండదనీ శాలరీ కూడా కట్ అయిపోతుందని ఆవేదన చెందుతున్నారు. కంపెనీ యాజమాన్యం మాత్రం తమ నిర్ణయం సరైనదని చెబుతోంది. ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేస్తేనే కంపెనీ బాగుంటుందనీ.. అప్పుడు లేఆఫ్స్ అవసరం ఉండదని అంటోంది.  

Post a Comment

0Comments

Post a Comment (0)