ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలగిన యడియూరప్ప

Telugu Lo Computer
0


కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని, తుది శ్వాస వరకు బీజేపీ కోసం పని చేస్తానని చెప్పారు. కర్ణాటక బీజేపీలో ఏకైక ప్రముఖ లింగాయత్ నేతగా పేరు తెచ్చుకున్న ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. యడియూరప్ప శుక్రవారం శాసన సభలో తన చిట్టచివరి ప్రసంగంలో చాలా భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ప్రతి రోజూ కర్ణాటక ప్రజల సేవ కోసమే వినియోగించానని తెలిపారు. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సేవలను ప్రశంసించారు. జనసంఘ్ కార్యకర్తగా, బీజేపీ కార్యకర్తగా తాను నిరంతరం ప్రజా సేవ కోసమే పని చేశానని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవడానికి ప్రయత్నించానని చెప్పారు. అణగారిన వర్గాల ప్రజల సమస్యలను అందరి దృష్టికి తీసుకొచ్చానని, వాటి పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. బీజేపీకి చెందిన సుప్రసిద్ధ నేతలు అటల్ బిహారీ వాజ్‌పాయి, మురళీ మనోహర్ జోషీ వంటివారితో కలిసి పని చేశానని తెలిపారు. కర్ణాటక ప్రజలకు సేవలందించడంలో విజయం సాధించాలని తోటి శాసన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)