ప్రతిభా పాటిల్ ​భర్త కన్నుమూత - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 24 February 2023

ప్రతిభా పాటిల్ ​భర్త కన్నుమూత


మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్​ భర్త దేవిసింగ్​ షెకావత్​ (89) కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం గుండెపోటుతో పూణెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ ఉదయం 9 గంటలకు చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సన్నిహితులు తెలిపారు. ప్రతిభా పాటేల్​ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోషల్​ మీడియా వేదికగా ప్రధాని మోడీ స్పందించారు. 'దేవిసింగ్​ షెకావత్​ సామాజిక సేవల ద్వారా సమాజంపై తనదైన ముద్ర వేశారని'అన్నారు. అలాగే కాంగ్రెస్​ సీనియర్​నేత దేవిసింగ్​ మృతి పట్ల ఎన్​సీపీ అధినేత శరద్​ పవర్​కూడా సంతాపం వ్యక్తం చేశారు. దేవిసింగ్ షెకావత్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అమరావతి నియోజకవర్గం నుంచి 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గొప్ప విద్యావేత్త. 1972లో ముంబై యూనివర్శిటీ నుంచి ఆయన పీహెచ్డీ చేశారు. అమరావతి తొలి మేయర్‭గా కూడా ఆయన పని చేశారు. భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి భర్తగా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు.

No comments:

Post a Comment