అగ్నిప్రమాదాల పొగతో దీర్ఘకాల రోగాలు !

Telugu Lo Computer
0


ఆస్ట్రేలియా లోని హాజిల్‌వుడ్ బొగ్గుగని అగ్ని ప్రమాదం 2014లో సంభవించిన తరువాత తదనంతర పరిణామాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అగ్నిప్రమాదం నుంచి వచ్చిన పొగలోని సూక్ష్మనలుసులు (పిఎం2.5)తో ఐదేళ్ల పాటు రిస్కు వెంటాడింది. శ్వాసకోశ సమస్యలతో బాధితులు ఎమర్జెన్సీ డిపార్టుమెంట్‌లో చేరి చికిత్స పొందవలసి వచ్చింది. పిఎం 2.5 సూక్ష్మనలుసులు అంటే 2.5 మైక్రోమీటర్ వ్యాసంతో లేదా అంతకన్నా తక్కువ పరిమాణంతో ఉండే పొగ నలుసులు. వీటిని పీలిస్తే చాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి తరువాత రక్తంలో చేరతాయి. ఒక ఘనపు మీటర్‌లో 10 మైక్రోగ్రాముల పిఎం2.5 పరిమాణం పెరిగితే ఆమేరకు అర్థ దశాబ్దంలో 10 శాతం వంతున శ్వాసకోశ సమస్యలు పెరుగుతుంటాయని అధ్యయనంలో వెల్లడైంది. గుండె నాళాల సమస్యలు కూడా పొగ వల్ల పెరుగుతుంటాయి. పొగ బారిన పడిన రెండున్నరేళ్ల తరువాత గుండెకు అతి తక్కువగా రక్తం సరఫరా అయ్యే వ్యాధి సంభవిస్తుంది. పరిమితమైన సాక్షాలతో ఈ సమస్యలు వస్తాయని వెల్లడైనా, భారీ అగ్ని ప్రమాదాల , బొగ్గుగనుల అగ్ని ప్రమాదాల వల్ల వచ్చే పొగతో ఇలాంటి అనర్థాలే దాపురిస్తాయని పరిశోధకులు హెచ్చరించారు. ఆస్ట్రేలియా లోని హాజిల్‌వుడ్ బొగ్గుగని ప్రమాదం 2014లో సంభవించింది. దాదాపు 45 రోజుల పాటు మంటలు చెలరేగాయి, ఫలితంగా విక్టోరియా లోని లాట్రోబ్ వ్యాలీలో పొగలు, బూడిద కమ్ముకున్నాయి. మోర్వెల్ పట్టణం లోని కొన్ని ప్రాంతాల్లో 23 రోజుల్లో 24 గంటల్లో ఆస్ట్రేలియా వాయు నాణ్యత ప్రమాణాల్లో ఘనపు మీటర్ పరిమాణంలో పిఎం2.5 స్థాయిలు 25 మైక్రోగ్రాములకు మించి పెరిగాయని , కొన్నిసార్లు పరిమితికి మించి 19 రెట్లు పెరిగాయని ఇదివరకటి విశ్లేషణ వెల్లడించింది. లాట్రోబ్ వ్యాలీలోని ప్రజల ఆరోగ్యానికి సంబంధించి 2009 2019 మధ్యకాలంలో ఆస్పత్రుల్లో పొగబాధితుల నుంచి సేకరించిన 2725 రికార్డుల బట్టి ఈ వివరాలు పరిశోధకులు అధ్యయనం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)