యూరప్‍లో ఉద్యోగాల పేరుతో రూ.2.5 కోట్లు కొల్లగొట్టిన కన్సల్టెన్సీ !

Telugu Lo Computer
0

హైదరాబాద్‌లోని ఓ జాబ్ కన్సల్టెన్సీ యూరప్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.2.5 కోట్లు కొల్లగొట్టింది. దాదాపు 150 మంది ఉద్యోగార్థులకు ఎర వేసి రూ.2.5 కోట్లు మోసం చేసింది. ఒక్కొక్కరు దగ్గర నుండి రూ.లక్ష-5 లక్షలు వసూలు చేసింది. ఫిర్యాదు అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న కన్సల్టెన్సీపై కేసు నమోదు చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోకన్సల్టెన్సీ  ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఉద్యోగార్ధులను ఆహ్వానించింది. తరువాత, కన్సల్టెన్సీ యజమాని వారిని యూరప్‌లోని వివిధ దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎర చూపి  దాదాపు 150 మంది ఉద్యోగార్థుల నుండి  రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లు  చేశాడు.  కొంత మంది అభ్యర్థులకు వారు కాల్ లేటర్ ఇచ్చారు. అయితే అవి ఫేక్ లేటర్స్ అని తేలడతంతో కన్సల్టెన్సీపై ఫిర్యాదుతో చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యూరప్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తుదారులను ప్రలోభపెట్టినందుకు కన్సల్టెన్సీపై కేసు నమోదు చేసిన తర్వాత, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)