నాగాలాండ్, మేఘాలయల్లో లో బీజేపీదే హవా !

Telugu Lo Computer
0


ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 16వ తేదీన త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా సోమవారం నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. త్రిపుర రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియాలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ రాష్ట్రంలో బీజేపీ కూటమికి 36 నుంచి 45 స్థానాలు వస్తాయని, లెఫ్ట్ కూటమికి 6 నుంచి 11 స్థానాలు, తిప్రా మోథా పార్టీకి 9 నుంచి 16 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ - ఎన్డీపీపీ కూటమికి విజయం సాధిస్తుందని తెలిపింది. ఈ కూటమికి 35 నుంచి 43 సీట్లు రావొచ్చని, కాంగ్రెస్ పార్టీకి ఒకటి నుంచి మూడు సీట్లు, ఎన్.పి.ఎఫ్‌కు 2 నుంచి 5 సీట్లు దక్కుతాయని తెలిపింది. మేఘాలయ రాష్ట్రంలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్.పి.పి) విజయభేరీ మోగిస్తుందని జీన్యూస్ - మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ వివరించింది., ఎన్.పి.పి.కి 21 నుంచి 26 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు 8 నుంచి 13 సీట్లు, బీజేపీకి 6 నుంచి 11 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 6 సీట్లు, ఇతరులకు 10 నుంచి 19 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)