ప్రీతి కేసులో నిందితులెవరైనా వదిలిపెట్టం !

Telugu Lo Computer
0


స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో సోమవారం రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో  కేటీఆర్ ప్రసంగిస్తూ   ప్రీతికి అన్యాయం చేసిన వాళ్లు సైఫ్ అయినా, సంజయ్ అయినా, ఎవరైనా సరే వదిలిపెట్టమని, చట్టపరంగా శిక్షిస్తామని అన్నారు ప్రీతి ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలపై చిల్లరమల్లర మాటలు మాట్లాడటం సరికాదని కెటిఆర్ హెచ్చరించారు. వరంగల్ ఎంజీఎంలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి దురదృష్టావశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో మనస్తాపానికి గురై చనిపోయిందని, ఆ అంశాన్ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డామని, మంత్రులు సత్యవతి రాథోడ్, దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎంపి మాలోతు కవితలు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిం చారని మంత్రి తెలిపారు. ఈ వేదిక నుంచి ప్రీతి కుటుంబానికి తమ పార్టీ, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. కొంతమంది రాజకీయంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ తాము ప్రభుత్వం, పార్టీ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)