కొండగట్టు ఆలయంలో చోరీని చేధించిన పోలీసులు

Telugu Lo Computer
0


తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. సదరు దొంగను కర్నాటకలోని బీదర్‌లో పట్టుకున్నారు. వీరంతా మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు. కొండగట్టు ఆలయంలో గత శుక్రవారం దొంగతనం జరిగింది. తొమ్మిది లక్షల విలువైన మకర తోరణం శఠగోపాలు, వెండి తొడుగు, వెండి వస్తువులు మొత్తం 15 కిలోల వెండి అపహరించారు. కాగా, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ కోసం దొంగలు శుక్రవారం అర్ధరాత్రి 1.20 గంటలకు ఆలయం వెనుక నుంచి గుడిలోకి వెళ్లి దొంగతనం చేసి ఆ తర్వాత వెనుక వైపు నుంచి గుట్ట కిందకు దిగి వెళ్లిపోయినట్టు గుర్తించారు. అనంతరం, మెయిన్‌రోడ్డుకు వెళ్లి బైకులపై కోరుట్ల, మెట్‌పల్లి మీదుగా కామారెడ్డి, నారాయణ్‌ ఖేడ్‌ నుండి బీదర్‌ వెళ్లినట్టు పోలీసులు ట్రాక్‌ చేశారు. ఇక, ఈ దొంగతనానికి ఎనిమిది ఉన్న ఓ గ్యాంగ్‌ ప్లాన్‌ చేసినట్టు గుర్తించారు. ప్రస్తుతానికి వారి వద్ద నుంచి 60 శాతం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆభరణాలు మొత్తం రికవరీ అయ్యాక ఈ ఘటన గురించి పోలీసులు వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)