ముంబైలో మొట్ట మొదటి ఏసీ డబుల్ డెక్కర్ ఈ-బస్ ప్రారంభం !

Telugu Lo Computer
0


భారతదేశంలో మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ ఈ-బస్సును  బృహన్ ముంబై ప్రారంభించింది. ముంబై పాలనా యంత్రాంగం ప్రవేశ పెట్టిన ఏసీ డబుల్ డెక్కర్ ఈ-బస్సుల సేవలను ప్రయాణికులు పొందాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ముంబై నగరంలో ప్రజా రవాణా కోసం ప్రాంతీయ రవాణా ఏజెన్సీ ఎలక్ట్రిక్ బస్సు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇంకా పూర్తి కావాల్సి ఉంది.  కొత్త వాహనం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి రెండు నుండి మూడు రోజులు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. అన్ని అనుమతులు పొందాక మొదటిసారిగా ప్రారంభించిన ఈ ఏసీ డబుల్ డెక్కర్ ఈ - బస్సు  కుర్లా బస్ డిపో - బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య సేవలు అందించనుంది. టికెట్ల ధర 5 కిలోమీటర్ల దూరానికి రూ. 6లు ఉంటుంది. 2023 చివరినాటికి  ఈ - బస్సుల సంఖ్య 200కి చేరేలా బృహన్ ముంబై చర్యలు తీసుకుంటోంది .  దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సును ముంబయిలోని బెస్ట్ ఫ్లీట్‌లో చేర్చామని అధికారులు తెలిపారు. బస్ చార్జింగ్ 80 నిమిషాలు పడుతుందని అధికారులు తెలిపారు. మొత్తం 20 బస్సులను నడుపనున్నట్లు బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) అండర్‌టేకింగ్ జనరల్ మేనేజర్ లోకేష్ చంద్ర తెలిపారు. కొత్త బస్సుల్లో డిజిటల్ టికెటింగ్, సీసీటీవీ కెమెరాలు, లైవ్ ట్రాకింగ్, డిజిటల్ డిస్‌ప్లే, అత్యవసర పరిస్థితుల కోసం పానిక్ బటన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ బస్సుల ఛార్జీలు సింగిల్ డెక్కర్ ఏసీ బస్సులకు వర్తించే ఛార్జీలే ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)