ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమం

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్‌లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్‌ చాటింగ్‌తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్‌ కేసులు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)