సూత్రధారి వినోద్ అదానీ - పాత్రధారి గౌతమ్ అదానీ !

Telugu Lo Computer
0


గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన ఫైనాన్సింగ్ డీల్స్‌లో కీలక పాత్రధారిగా ఉన్నట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ వెల్లడించారు. వినోద్ అదానీ గ్రూప్‌కు ఫైనాన్సింగ్ ఒప్పందాలపై చర్చలు జరిపడంతో పాటు అతి పెద్ద కొనుగోళ్లలో కీలక పాత్ర పోషించినట్లు ధృవీకరించబడిందని అండర్సన్ అన్నారు. గత ఏడాది సిమెంట్ వ్యాపారాలను హస్తగతం చేసుకునే సమయంలో అదానీ గ్రూప్, దాని బ్యాంకులు ప్రత్యేకించి కొన్ని సంక్లిష్టమైన దాఖలాలను బయటపెట్టాయని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. కంపెనీ సమర్పించిన 85 పేజీల డాక్యుమెంట్‌లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, దుబాయ్‌లలో రిజిస్టర్ అయిన ఏడు లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానించబడి ఉన్నాయి. ఈ అన్ లిస్టెడ్ కంపెనీల లబ్ధిదారులుగా గౌతమ్ అదానీకి బదులుగా సోదరుడు వినోద్, వినోద్ భార్య రంజన్‌బెన్ గా ఉన్నట్లు వెల్లడైంది. దేశంలోని అదానీకి చెందిన లిస్టెడ్ కంపెనీల్లో వినోద్ అదానీ, ఆయన భార్య ఎలాంటి పదవులను కలిగి లేరని కంపెనీ వెబ్‌సైట్ లోని సమాచారం ప్రకారం వెల్లడైంది. అయితే.. గ్రూప్ చేస్తున్న అతిపెద్ద కొనుగోలు కోసం సమర్పించిన పత్రాల ద్వారా వినోద్ అదానీ గ్రూప్‌లో కమాండింగ్ ప్రభావాన్ని కలిగి ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. పెద్ద వ్యాపారం చేస్తున్నప్పుడు చిన్న కంపెనీల చిట్టడవిని ఎలా ఉపయోగించుకుంటారో స్వాధీన పత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొంది. అదానీ గ్రూప్ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించేటప్పుడు.. వాటి వ్యూహాలను ప్లాన్ చేయటంలో కీలక సంధానకర్తగా వినోద్ అదానీ ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక ఉటంకించింది. అయితే అదానీ ఎంటర్ ప్రైజెస్ FPO నేపథ్యంలో గత కొన్ని వారాలుగా వినోద్ అదానీ దుబాయ్‌లో ఉంటున్నారు. అయితే ఆయన దాఖలు చేసిన వివరాల ప్రకారం సైప్రియాట్ జాతీయుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. వినోద్ అదానీ, అనేక సన్నిహిత సహచరుల ద్వారా ఆఫ్‌షోర్ షెల్ ఎంటిటీల యొక్క విస్తారమైన చిక్కును నిర్వహిస్తున్నారు" అని హిండెన్‌బర్గ్ నివేదిక పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)