మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ పిటీషన్ కొట్టివేత - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 10 February 2023

మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ పిటీషన్ కొట్టివేత


జమ్ము కశ్మీర్ అల్లర్ల నేపధ్యంలో తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ సినిమాకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ తోడ్పాటు అందిస్తే గుజరాత్ అల్లర్ల నేపధ్యంలో తెరకెక్కిన బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందిన ఈ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ లింకుల్ని కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. మరోవైపు డాక్యుమెంటరీని బ్యాన్ చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని మోదీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ తప్పుదోవ పట్టిస్తోందని కేంద్రం బ్యాన్ చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడా కన్పించకుండా సెన్సార్ విధించింది. మరోవైపు హిందూ సేన అనే సంస్థ అయితే బీబీసీ ఛానెల్‌ బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసి..పిటీషన్‌ను తిరస్కరించింది. అంతకుముందు సుప్రీంకోర్టు..కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీ ఒరిజినల్ రికార్డుల్ని సమర్పించాలని ఆదేశించింది. 3 వారాల్లో సమాధానమివ్వాలని తేల్చి చెప్పింది. బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం కోసం దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది పూర్తిగా అపోహలతో కూడిన పిటీషన్ అని అభిప్రాయపడింది. బీబీసీ డాక్యుమెంటరీ కేంద్ర ప్రభుత్వం, ఇండియాపై పక్షపాత ధోరణితో డాక్యుమెంటరీని రూపొందించారని, అంతర్జాతీయ ఇండియా, ప్రధాని మోదీ పేరు మార్మోగడంతో కుట్రపూరితంగా చిత్రీకరించారని పిటీషన్‌లో తెలిపారు. ఇది పూర్తిగా అపోహలతో కూడుకున్న పిటీషన్ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం విచారించింది. పిటీషన్‌దారులు పూర్తిగా తప్పుగా ఊహించారని, ఇది ఏ మాత్రం విచారణార్హం కాదని తేల్చారు.

No comments:

Post a Comment