తెలంగాణ ప్రభుత్వంతో మహీంద్రా కంపెనీ ఒప్పందం

Telugu Lo Computer
0


తెలంగాణలో పెటుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ముందుకొచ్చింది. ప్రభుత్వంతో తాజాగా జరిగిన ఒప్పందం ప్రకారం ఎలక్ట్రిక్ 3- వీలర్, 4- వీలర్ వాహనాల అభివృద్ధి, తయారీ కోసం మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పనుంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి ఒక ప్లాంట్ ఉంది. దీనికి అనుబంధంగానే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని స్థాపించనున్నట్లు మహీంద్రా గ్రూప్ ప్రకటించింది. సుమారు ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1000 కోట్లు వరకు పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జేజురికర్ తెలిపారు. రాష్ట్రంలో మహింద్రా కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలను అందుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)