కరాచీ లో పోలీస్ కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి : 9 మంది మృతి

Telugu Lo Computer
0


పాకిస్థాన్‌లోని కరాచీ లో పోలీస్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, రేంజర్ సిబ్బంది, ఒక పౌరుడు, ఐదుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఆత్మాహుతి బాంబు ధారులైన ఇద్దరిని హతమార్చడం, మరొకరు తనకు తానే పేల్చుకోవడం జరిగింది. కరాచీ పోలీస్ చీఫ్ కార్యాలయం లోకి ఎనిమిది మంది ఉగ్రవాదులు చొరబడి కాల్పులకు తెగబడడంతో సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ భద్రతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెహ్రీక్ ఇ తాలిబన్ ఉగ్రవాదులకు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాలకు చెందిన 18 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్ ప్రకటించింది. పోలీస్ భవనం లోకి ఉగ్రవాదులు చొరబడిన మూడు గంటల్లోనే వారిని తుద ముట్టించడమైందని ప్రభుత్వ సలహాదారు ముర్తజా వహాబ్ ప్రకటించారు. అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఈ దాడిని ఖండించారు. దాడిని విజయవంతంగా ఎదుర్కొన్న భద్రతా దళాలకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాళి అర్పించారు. పోలీస్ ప్రధాన కార్యాలయం లోకి చొరబడడానికి ఉగ్రవాదులు కొందరు గ్రెనేడ్లు విసిరారని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి రాణా సనౌల్లా ఖాన్ పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియడంతో గత నవంబర్ నుంచి ఉగ్రవాదుల దాడులు పాక్‌లో కొనసాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)